Shawarma: షవర్మా తిని నలుగురికి అస్వస్థత.. 15 రోజుల క్రితమే మూతపడిన గ్రిల్ హౌస్

by Rani Yarlagadda |
Shawarma: షవర్మా తిని నలుగురికి అస్వస్థత.. 15 రోజుల క్రితమే మూతపడిన గ్రిల్ హౌస్
X

దిశ, వెబ్ డెస్క్: వద్దురా బాబు.. తినకండిరా అంటే వినరు.. మోమోలు, షవర్మాలే కాదు.. ఆఖరికి బిర్యానీ తిని కూడా ఒక యువతి మరణించింది. అయినా సరే.. తినడం మాత్రం ఆపరు. బయటి ఫుడ్ వద్దు.. ఇంటి ఫుడ్డే ముద్దు అంటే.. ఇంట్లో రుచులు వేరు.. బయటి రుచులే బెటరు అనుకుంటూ.. లొట్టలేసుకుని మరీ తింటున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపుదాడులు చేసి.. రెస్టారెంట్లు, హోటళ్లలో ఉన్న పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లు చూపించినా సరే.. వాళ్లు అలానే చెప్తారు.. మనం తింటే అరిగిపోద్ది కదా.. ఏమీ కాదనుకుంటూనే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బిర్యానీలు లాగిస్తున్నారు.

15 రోజుల క్రితం సికింద్రాబాద్ లోతకుంటలోని గ్రిల్ హౌస్ లో (Lothakunta Grill House) షవర్మా తిని పలువురు అస్వస్థతకు గురి కావడంతో యాజమాన్యం దానిని మూసివేసింది. మూడు రోజుల క్రితమే ఆ గ్రిల్ హౌస్ ను తెరిచి షవర్మా విక్రయాలను ప్రారంభించారు. అక్కడ షవర్మా తిని పలువురు ఆస్పత్రి పాలయ్యారన్న విషయం తెలిసి కూడా.. మళ్లీ అక్కడి షవర్మానే తినేందుకు ఎగబడ్డారు. ఫలితంగా నలుగురు వ్యక్తులకు ఫుడ్ పాయిజన్ (Food Poison) అయింది. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికైనా.. ఆ గ్రిల్ హౌస్ పై చర్యలు తీసుకోవాలని, మళ్లీ తెరిచే అవకాశం లేకుండా గ్రిల్ హౌస్ ను సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story