- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
LIC నుంచి నాలుగు కొత్త ప్లాన్‌లు
దిశ, తెలంగాణ బ్యూరో: భారత ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) కొత్తగా నాలుగు పాలసీలను ప్రవేశపెట్టింది. యూత్‌ను ఉద్దేశించి తీసుకొచ్చిన ఈ పాలసీలు టర్మ్, క్రెడిట్ లైఫ్‌కు సంబంధించినవని, భవిష్యత్తు భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టినవని ఎల్ఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. టీనేజ్‌లో ఉండగానే ఈ టర్మ్ పాలసీలను కట్టొచ్చని, ఆపద సమయంలో జీవిత బీమాగా ఉపయోగపడతాయని ఒక ప్రకటనలో తెలిపింది. యువ టర్మ్ పాలసీ, డిజి టర్మ్ పాలసీ, యువ క్రెడిట్ లైఫ్, యువ డిజి క్రెడిట్ లైఫ్ పాలసీల పేరుతో ఉండే ఈ నాలుగూ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ నాలుగు పాలసీలు 18-45 ఏండ్ల వయసువారిని ఉద్దేశించి ప్రవేశపెట్టినవని, నెలవారీ/క్వార్టర్లీ/వార్షిక పద్ధతిలో ప్రీమియం చెల్లిస్తే దురదృష్టవశాత్తూ పాలసీ మధ్యలోనే చనిపోతే వారికి మొత్తం బీమా అమౌంట్ అందుతుందని తెలిపింది. పాలసీని కట్టిన తర్వాత ఎంత వయసు వచ్చినా అది లైవ్‌లోనే ఉంటుందని, రూ. 50 లక్షల మొదలు గరిష్టంగా రూ. 5 కోట్ల వరకు ఈ పాలసీ వర్తిస్తుందని పేర్కొన్నది.