హెల్త్ డైరెక్టర్‌కు మరో షాక్.. ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కీలక నిర్ణయం!

by Satheesh |
హెల్త్ డైరెక్టర్‌కు మరో షాక్.. ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కీలక నిర్ణయం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును వివాదాలు వీడటం లేదు. ఇటీవల కాలంలో ఆయన వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన ఇఫ్తార్ విందులో చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తాజాగా సీఎస్‌కు లేఖ రాసింది. శ్రీనివాస్ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా ఇఫ్తార్ విందు సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైద్యులు తగ్గించలేని జబ్బును తాయెత్తు తగ్గించిందని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

Advertisement

Next Story