- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేసింగ్.. ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఇదే!
దిశ, డైనమిక్ బ్యూరో : భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఫార్ములా ఈ-రేసింగ్ హైదరాబాద్‌లో జరగనున్నాయి. దీనిపై ప్రముఖ పారిశశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విటర్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఈవెంట్‌ను నిర్వహించే మొదటి భారతీయ నగరంగా హైదరాబాద్ అవతరించిందని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా 8 సంవత్సరాల రేసింగ్ తర్వాత, దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో రేసింగ్ జరుగుతున్న ఈ సందర్భంగా తెలంగాణా ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే టైటిల్ స్పాన్సర్ గ్రీన్‌కో రేసును విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ కూడా ఆనంద్ మహీంద్రకు ధన్య వాదాలు తెలిపారు. కాగా, ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఫార్ములా ఈ రేసింగ్ కోసం టికెట్ల బుకింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే, నగరానికి ఈ-రేసింగ్ కార్లు కూడా చేరుకున్నాయి. ఇక, 2023 ఫిబ్రవరి 11న ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఈవెంట్ ద్వారా హైదరాబాద్ చరిత్ర సృష్టించోబోతోంది.
Welcome to Hyderabad Anand Ji 🏎️ https://t.co/b2IFjMpmBg
— KTR (@KTRBRS) February 3, 2023