- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ పవర్‌లోకి రాగానే BRS నాయకులకు చుక్కలే: పొన్నాల లక్ష్మయ్య
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ అవినీతికి చర్లపల్లి జైలులోనే శిక్ష వేయాలని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతి చిట్టా బయటకు తీస్తామన్నారు. దొంగ హామీలిస్తూ.. ప్రజలను మోసం చేశాడన్నారు. ప్రతి కార్యక్రమం, స్కీమ్‌లో కమీషన్లతో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ఆశీంచిన స్థాయిలో లాభం చేకూర్చడం లేదన్నారు. కాంట్రాక్టర్లకు పెద్ద పీఠ వేస్తూ అవినీతికి పాల్పడుతున్నారన్నారు.
2015 బడ్జెట్లో రూ. 8,300 కోట్లు ఖర్చు పెడితే.. 34 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చని కేసీఆర్ చెప్పారని, కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదన్నారు. ఇక ఖమ్మం సీతారామం ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నదన్నారు. పాలమూరు రంగారెడ్డికి అతీ గతి లేదన్నారు. శ్రీరామ్ సాగర్, జూరాల, ఎల్ఎండీ నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుండి వాటిని పునరుద్ధరించాలన్నారు. ఈ దేశ ప్రధాని, హోమ్ మినిస్టర్ ఇద్దరూ అత్యంత దోపిడీదారులన్నారు. కాంగ్రెస్ప్రభుత్వం రాగానే బీఆర్ఎస్ నాయకులకు చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు.