- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ఊసే లేదు: మాజీ ఎంపీ వినోద్ కుమార్
దిశ, వెబ్ డెస్క్: లోక్‌సభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్రబడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏపీ, బీఆర్ లాంటి రాష్ట్రాలకు కేటాయింపులు జరిపింది. కానీ తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు జరపలేదు. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రబడ్జెట్‌లో తెలంగాణ ఊసే లేదని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో ఏపీ, బీహార్ రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. హైదరాబాద్-బెంగళూరు కారిడార్ బదులు హైదరాబాద్-నాగ్‌పూర్ కారిడార్ ప్రకటిస్తే ఉత్తర తెలంగాణ బాగుపడేదని ఆయన పేర్కొ్న్నారు. హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో 150 కిలో మీటర్లు మాత్రమే తెలంగాణ ప్రాంతం ఉందని చెప్పారు. తెలంగాణలోని ప్రాజెక్టులను జాతీయ హోదా అడుగుతున్నామని చెప్పారు. ఏపీ విభజన చట్టంలో ఉన్న హామీలను తెలంగాణ ఎంపీలు పట్టుబట్టి సాధించుకోవాలని సూచించారు. తాము ఎంపీలుగా ఉన్న సమయంలో చాలా హక్కులపై పోరాటం చేసి సాధించామని ఎంపీ వినోద్ గుర్తు చేశారు.