- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జహీరుద్దీన్ అలీఖాన్ మరణం తీరనిలోటు.. మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా
దిశ , తెలంగాణ బ్యూరో : సీనియర్ జర్నలిస్టు సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మరణం సమాజానికి తీరని లోటని, ‘తన్ ఇన్సాఫ్’ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా అన్నారు. జహీరుద్దీన్ గొప్పలౌకిక, ప్రజా స్వామ్య వాదన్నారు. సోమవారం ‘జహీరుద్దీన్ అలీ ఖాన్’ సంతాప సభను హైదరాబాద్ మగ్ధుం భవన్ లో నిర్వహించారు.ఈ సందర్బంగా సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ.. జహీరుద్దీన్ ఒక సామాజిక సేవకుడని, ఆయనకు విస్తృతమైన సంబంధాలు ఉండేవని, రవీశ్ బర్కాదత్ లాంటి ప్రముఖ జర్నలిస్టులతో నిత్య సంబంధాలు ఉండేవని అన్నారు. కేవలం మైనార్టీలే కాకుండా దళిత పీడిత వర్గాల అభ్యున్నతి కోసం ఆయన పరితపించేవారని తెలిపారు . నిరుపేద విద్యార్థులకు కంప్యూటర్ స్వయం ఉపాధి శిక్షణ ఇప్పించేవారని అన్నారు.
కమ్యూనిస్టుల అవసరం ఎంతో ఉన్నదని, వారే అసలైన లౌకికవాదులని జహీరుద్దీన్ విశ్వసించేవారని, ఆయనను కలిసినప్పుడుల్లా అనేక కొత్త అంశాలు తనకు తెలిసేవని అజీజ్ పాషా అన్నారు. భారతదేశం అభ్యున్నతి చెందాలని, మతోన్మాద రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించేవారని, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు లభించాలని జహీరుద్దీన్ పరితమించేవారని చెప్పారు. మణిపర్ ఘటనపై ప్రధాని మోడీ పార్లమెంట్ ఇచ్చిన సమాధానాన్ని అందరూ చూశారని, ప్రతిపక్షాలను ఎగతాళిగా అవహేళ న చేస్తూ మాట్లాడారని తెలిపారు . వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అసలైన మంచిరోజులు రావాలంటే మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని, ఇందుకు అందరూ తమ వంతు పోరాటం చేయాలని అయన పిలుపునిచ్చారని అయన సేవలను గుర్తు చేసారు .
కె .శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అబిద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ప్రముఖ ఉర్దూ దిన పత్రిక సియాసత్ నాటి నుండి నేటి వరకు లౌకక వాదానికి కట్టుబడి ఉన్నదన్నారు. అబీద్ అలీ ఖాన్ తర్వాత జాహేద్ అలీఖాన్, ఆ తర్వాత జహీరుద్దీన్ అలీఖాన్ ఆ విలువలను కొనసాగించారని కొనియాడారు. 1970 దశకంలోనే అబీద్ అలీఖాన్ అతిపెద్ద జాతీయ జెండాను ఏర్పాటు చేసిన దేశ భక్తుడన్నారు. జహీర్ నిరంతరం ప్రజల కోసం పరితపించేవారని, మూడు నాలుగు వారాల క్రితమే తనకు ఫోన్ చేసి మాట్లాడారని, దాదాపు అన్ని పత్రికలు ఏకపక్షంగా వార్తలు ప్రచురించడం ఆందోళనకరమని, దీనిపై ఏదైనా చేయాలని తనతో చెప్పినట్టు శ్రీనివాస్ రెడ్డి అయన మాటలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు షేక్ నదీమ్ , సలాం ఉల్లాఖాన్,నవాజ్ తదితరులు పాల్గొన్నారు.