- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ కుటుంబ అవినీతిపై దర్యాప్తు జరిపించండి: రవీంద్రనాయక్
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనతో తెలంగాణ పూర్తిగా విధ్వంసమైందని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబం అవినీతిపై దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ పాలనలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆయన పేర్కొన్నారు. నిధులు దారి మళ్లాయని ఆ వినతిలో పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి, ఆశ్రమ పాఠశాలలు, స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కళాశాలల నిర్వహణకు చర్యలు చేపట్టాలన్నారు. తండాలు, గూడాల్లో మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలను వెంటనే పునఃప్రారంభించాలని వినతిలో పేర్కొన్నారు.
గిరిజన సలహామండలి ద్వారా తీర్మానాలు చేయించాలని, అంతేకాకుండా గత ప్రభుత్వంలో గిరిజనులకు జరిగిన అన్యాయాలను, అనేక గిరిజన అభివృద్ధి సంస్థల విధ్వంసాన్ని అరికట్టాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను వేరు చేసి ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని రవీంద్రనాయక్ డిమాండ్ చేశారు. కేంద్రం ద్వారా మంజూరైన గిరిజన యూనివర్సిటీని వెంటనే ప్రారంభించాలని పేర్కొన్నారు. 10 శాతం ఎస్టీ రిజర్వేషన్ జీవోను వెంటనే అమలుచేసి ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లో 150 అడుగుల సేవాలాల్ విగ్రహం, సేవాలాల్, జగదాంబ(మేరమ్మ) మందిరాలు నిర్మించాలని పేర్కొన్నారు.