- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్విన్స్ చేయలేకపోయిన ఈటల.. కాంగ్రెస్ గూటికి పొంగులేటి?
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారా? ఈ దిశగా నిర్ణయం కూడా ఫైనల్ అయిందా? బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటలతో గురువారం రహస్యంగా జరిగిన సమావేశంలో పొంగులేటిని, జూపల్లిని కన్విన్స్ చేయలేకపోయారా? అధికార బీఆర్ఎస్‌ను ఓడించే స్ట్రాటజీ కాషాయం వద్ద లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తుంది పొంగులేటి అనుచరుల నుంచి. ఈ మేరకు కాంగ్రెస్‌లో చేరాలని పొంగులేటిపై అనుచరులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయన కూడా నిర్ణయం తీసుకున్నట్లు జూన్‌లో పార్టీ మార్పుపై ప్రకటన చేసే అవకాశం స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది.
దిశ బ్యూరో, ఖమ్మం: పొంగులేటి పార్టీ మార్పు చివరి అంకానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కాలంపాటు అన్ని సమీకరణలు బేరీజు వేసుకున్నాక ఆయన తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇన్నాళ్లూ ఆచితూచి అడుగులు వేసిన పొంగులేటి వచ్చే ఎన్నికల్లో ఫలితాలు.. జిల్లాలో ఏ పార్టీ పటిష్టంగా ఉంది.. ఏ పార్టీలో చేరితే ప్రజలు ఆదరిస్తారు.. తదితర అంశాలను బేరీజు వేసుకుని కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నారు. ఏది ఏమైనా పొంగులేటి జిల్లాలో ఉన్న పరిస్థితిని బట్టి బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీలో చేరితేనే లాభం చేకూరుతుందనే వాదనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్, బీజేపీ వలవేసినా..
టీఆర్ఎస్‌ను వీడి పొంగులేటి వేరే పార్టీలోకి కచ్చితంగా వెళ్తారని గతంలో ఎన్నో ప్రచారాలు జరిగాయి. అయితే అప్పటినుంచే పొంగులేటికి కాంగ్రెస్, బీజేపీలు వలవేశాయి. తమ పార్టీలోకి చేర్చుకుని ఉమ్మడి జిల్లాలో లాభం పొందాలని రెండు పార్టీలూ ఢిల్లీ స్థాయిలో తీవ్రంగా ప్రయత్నించాయి. తమ పార్టీలోకి పొంగులేటి రావడం ఖరారైందని కాంగ్రెస్ నేతలు గతంలోనే బాహాటంగానే చెప్పారు. పొంగులేటి హస్తవాసి మంచిదని, మళ్లీ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వస్తుందని అందరూ సంబరపడ్డారు. బీజేపీ సైతం అప్పట్లో శ్రీనివాసరెడ్డి కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే సోషల్ మీడియా వేదికగా కూడా ఎన్ని ప్రచారాలు జరిగినా పొంగులేటి, ఆయన అనుచరులు స్పందించకపోవడం గమనార్హం. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పొంగులేటి పార్టీ మార్పు అనేది కర్ణాటక ఎన్నికల తర్వాతే నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం గతంలోనే జరిగింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఆ ప్రభావం తెలంగాణలో కూడా ఉంటుందనే విశ్లేషణల నేపథ్యంలోనే పొంగులేటి కాంగ్రెస్‌లో చేరేందుకే సిద్ధపడ్డట్లు సమాచారం. అంతేకాదు.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పొంగులేటి ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు.. అదీగాక కేసీఆర్ బీఆర్ఎస్ పై దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో బలమైన శక్తులు కలిస్తే బీఆర్ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించవచ్చనే భావనతోనే హస్తం వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జిల్లాలో బీజేపీకి బలం తక్కువ..
కొంతకాలంగా అధికార పార్టీని బీజేపీ రాష్ట్రస్థాయిలో ఢీకొంటూనే ఉంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆపార్టీకి సరైన లీడర్ లేక మూలుగుతూ నడుస్తోంది. జిల్లా నేతలు కొంతమంది ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసే స్థాయిలో మాత్రం లేరు. కనీసం అధికార పార్టీ నేతల మాటలకు కౌంటర్ ఇచ్చేస్థాయిలో కూడా లేకపోవడం ఆ పార్టీకి మైనస్సే. అంతేకాదు.. చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటు బ్యాంకు కూడా లేకపోవడం గమనార్హం. ఎన్నికలకు టైం తక్కువగా ఉండడంతో ఇప్పుడు బీజేపీలో చేరి పార్టీని గ్రౌండ్ లెవెల్లో పటిష్టం చేసే వీలుండదనే పొంగులేటి ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నారు. జూన్లో అధికారికంగా ఏ పార్టీలో చేరేది స్పష్టం చేయనున్నట్లు సమాచారం.
సొంత కుంపటి నష్టమనే భావన..
కాంగ్రెస్, బీజేపీలో చేరకుండా సొంతంగా పార్టీ పెడతారనే ప్రచారమూ ఒకదశలో జోరందుకుంది. కానీ పొంగులేటి అలాంటి ఆలోచనేమీ లేదని స్పష్టం చేయడంతో ఆ ఊహాగానాలకు ప్రస్తుతం పుల్ స్టాప్ పడినా.. రాష్ట్రవ్యాప్తంగా అనుకూలమైన కొన్ని నియోజకవర్గాల్లో తన అనుచరులను పోటీకి దింపుతాడనే ప్రచారం కూడా సాగింది. అయితే అనుచరులనుకున్నవారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత తనతో ఉంటారనే గ్యారెంటీ కూడా లేదనే అభిప్రాయం పొంగులేటిలో నెలకొని ఉందని సమాచారం. పోటీ చేసే అభ్యర్థులు గతంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా లేదా ఇతర పదవులో కొనసాగి ఉంటే.. గెలిచిన తర్వాత వారు తీసుకునే నిర్ణయం తనకు అనుకూలంగా ఉండదనే భావన నెలకొనడంతో ఆ నిర్ణయం కూడా వదిలేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఒత్తిడి అధికమవడంతో ఫైనల్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.
Read more: