మీరు పోలీసులా లేక వ్యక్తిగత ఉద్యోగులా?: Konda Vishweshwar Reddy

by GSrikanth |   ( Updated:2022-08-25 12:55:41.0  )
మీరు పోలీసులా లేక వ్యక్తిగత ఉద్యోగులా?: Konda Vishweshwar Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో: బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పందించారు. ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా.. ఇంతవరకు నెరవేరలేదన్నారు. మంగళవారం ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సురేష్ ఆత్మహత్యపై కొండా విశ్యేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ''మీరు సమ్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇదేనా మీ పరిష్కారం'' అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్నది టీఎస్ పోలీసులా లేదా మీ వ్యక్తిగత ఉద్యోగులా? వారికి కూడా కొంత గౌరవం ఇవ్వండి అంటూ ఫైర్ అయ్యారు. కాగా, గంజాయిపై విచారణ పేరిట పోలీసులు, అధికారులు వేధించడంతోనే సురేశ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని వర్సిటీలోని డిస్పెన్సరీ ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్ చేస్తూ సురేష్ వారికి ఏకైక కుమారుడు. వేధింపుల పేరిట ఓ విద్యార్థి ప్రాణాలను బలి తీసుకున్నారు. మీరు కూడా మనుషులేనా? అంటూ విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed