- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కేసీఆర్‌కు ఇష్టమైన నంబర్ 6.. అందుకే 6 పేపర్లు లీక్ చేశారు’
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇష్టమైన నంబర్ 6 అని, అందుకే 6 పేపర్లను లీక్ చేశారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఎద్దేవా చేశారు. గన్ పార్కులో బీజేపీ చేపట్టిన నిరసన దీక్షలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం వందలాది మంది బలిదానం చేసినందుకు చిహ్నంగా ఈ అమరవీరుల స్తూపం ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ నేడు ఏమైందని ఆయన ప్రవ్నించారు. అవన్నీ దోపిడీకి గురయ్యాయని ఆయన ఆరోపించారు. టీఎస్పీఎస్సీ లీకేజీ అనుకోకుండా జరిగింది కాదని, వ్యూహాత్మకంగానే చేశారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌కు సంఖ్యా వాస్తు ప్రకారం 6 అంకె పిచ్చి అని, అందుకే 6 పేపర్లను లీక్ చేశారని సెటైర్లువేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఉద్యమకారులపై రోజుల తరబడి జైళ్లో పెట్టిన దాఖలాల్లేవని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసి రోజుల తరబడి జైళ్లో పెడతారా అని బూర ప్రశ్నించారు. కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. తప్పు చేస్తే తన కొడుకు, బిడ్డయినా వదిలేది లేదని చెప్పిన కేసీఆర్ మాటలేమయ్యాయని ఆయన ప్రశ్నించారు. లీకేజీ దోషులను ఎందుకు శిక్షించడం లేదని, ఎందుకు బర్తరఫ్ చేయట్లేదని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ నిలదీశారు.