- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీ మార్పు వార్తలపై స్పందించిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
దిశ, వెబ్‌డెస్క్: పార్టీ మార్పు వార్తలపై మాజీ ఎంపీ, టీఆర్ఎస్ కీలక నేత బూర నర్సయ్య గౌడ్ స్పందించారు. సోషల్ మీడియాలో పనిగట్టుకొని కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు.
కాగా, మునుగోడు బైపోల్‌లో టీడీపీ పోటీ చేయనుందని, బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావడంతో బలమైన బీసీ నేత అయిన బూర నర్సయ్యను పోటీకి టీడీపీ నేతలు ఒప్పిస్తున్నారని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా మునుగోడులో గౌడ సామాజిక వర్గం ఓటర్లే ఎక్కువ. నర్సయ్య గౌడ్‌కు మునుగోడుతో మంచి అనుబంధం ఉంది. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికలోనూ బూర అధికార పార్టీ టికెట్ ఆశించారు. తనకు టికెట్ రాకుండా మంత్రి జగదీశ్ రెడ్డి అడ్డుకుంటున్నారంటూ ఓపెన్‌గానే ఆయన ఆరోపణలు చేశారు. అంతేకాదు రెండు నెలలుగా నియోజకవర్గంలో తిరుగుతున్న జగదీశ్ రెడ్డి.. ప్రచారానికి బూరను పిలవడం లేదని ఆగ్రహంగా ఉన్నా బూర పార్టీ మారబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వీటన్నింటికీ చెక్ పెడుతూ.. పార్టీ మార్పు వార్తలను బూర నర్సయ్య గౌడ్ ఖండించారు.