- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దశాబ్ది ఉత్సవాలను బహిష్కరించాలి.. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనుకుంటున్న దశాబ్ది ఉత్సవాలను వెంటనే బహిష్కరించాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పది సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. రాష్ట్రం కోసం 1200 మంది బలిదానమైతే..అమర వీరుల కుటుంబాలకు ఇప్పటి వరకు న్యాయం చేయలేదన్నారు. కేసీఆర్కుటుంబానికి మాత్రం పదవులు వచ్చాయన్నారు. మూడో సారి అధికారం కోసం ప్రజలను మోసం చేసేందుకు దశాబ్ది ఉత్సవాల పేరుతో కేసీఆర్ కొత్త ప్లాన్ వేశారన్నారు. ఈ పది సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉన్నదన్నారు.
‘‘రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చావా? దళిత ముఖ్యమంత్రి ఇచ్చావా? నిరుద్యోగ భృతి,రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చావా?” అంటూ రాముల్ నాయక్ ఫైర్అయ్యారు. కేసీఆర్ వచ్చాక.. అన్నింటిలోనూ అవినీతే అన్నారు. కర్ణాటకలో 40 శాతం కమీషన్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారని, త్వరలో తెలంగాణలోనూ కర్ణాటక ఫలితాలు రిపీట్ అవుతాయన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యంతో ఇప్పటి వరకు గిరిజన యూనివర్సిటీ రాలేదన్నారు. పోడు భూములకు పట్టాలివ్వలేదన్నారు. ప్రజల్ని డైవర్ట్ చేయడానికే దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారన్నారు. కానీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని పేర్కొన్నారు. కర్ణాటకలో మంత్రులు ఏ విధంగా ఓడిపోయారో ఇక్కడ కూడ అదే జరుగుతుందని రాముల్ నాయక్ జోస్యం చెప్పారు.