ఆమెకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి: జగ్గారెడ్డి

by srinivas |
ఆమెకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి: జగ్గారెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింట్ ప్రెసిడెంట్ కె. తారాకరామారావు (BRS Working ప్రెసిడెంట్ K. Tarakaramarao) క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Sangareddy former MLA Jaggareddy) డిమాండ్ చేశారు. కొండా సురేఖపై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్‌‌పై స్పందించిన కేటీఆర్.. ‘దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికి. గతంలో సురేఖ మాట్లాడిన బూతుమాటలను గుర్తుతెచ్చుకోవాలి. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్‌ చేశారన్నప్పుడు వాళ్ల మనోభావాలు దెబ్బతినలేదా? మా ఇంట్లో మహిళలు బాధపడలేదా?. వాళ్లు ఏడవరా?’ అంటూ మండిపడ్డారు.

అయితే కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను జగ్గారెడ్డి ఖండించారు. మాజీ సీఎం కేసీఆర్ (Former Cm Kcr), కేటీఆర్‌కు దండలు వేసిన ఆడవాళ్లను అలాగే చూస్తారా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ఎలాంటి సంస్కృతి తెస్తున్నారని నిలదీశారు. ఇప్పటికైనా కొండ సురేఖపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. కొండా సురేఖ విషయంలో పెద్దరికంగా వ్యవహరించాలని సూచించారు. పదేళ్ల పాటు రాజభోగాలు అనుభవించి పరిజ్ఞానం లేని వ్యక్తిలా మాట్లాడవద్దన్నారు. మరో పదేళ్లు ఆగి పరిపూర్ణ చెందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. ఇంట్లో ఉన్న కొండా సురేఖపై విమర్శలు చేసి తన్నించుకుంటున్నారని జగ్గారెడ్డి విమర్శించారు.

Next Story