కాంగ్రెస్‌లో తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే రాజమల్లు కన్నుమూత

by GSrikanth |
కాంగ్రెస్‌లో తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే రాజమల్లు కన్నుమూత
X

దిశ, పెద్దపల్లి: అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన.. సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయి ఇంటికొచ్చారు. అనూహ్యంగా ఇవాళ తెల్లవారుజామున గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. కాగా, జిల్లా రాజకీయాల్లో రాజమల్లు తనదైన ముద్ర వేసుకున్నారు. ఆపద అంటూ తన గడప తొక్కిన అందరినీ ఆదుకున్న ఆయన మరణాన్ని అభిమానులు, కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. ఆయన మరణవార్త తెలిసిన జిల్లా ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

కాగా, సుల్తానాబాద్ గ్రామ పంచాయతీలో కారోబార్‌గా చిరు ఉద్యోగంతో జీవనాన్ని ప్రారంభించి రాజమల్లు.. 1981లో ఎన్టీఆర్ అభిమాన సంఘం స్థాపించారు. అదే సంవత్సరంలో సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఎల్ఎంబీ బ్యాంకు చైర్మన్‌గా, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా అంచలంచలుగా ఎదిగారు. 1989లో తొలిసారి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 1994లో మరోసారి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి 45 వేల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed