ఆ ప్రాజెక్టు కట్టింది నిజాం రాజు కాదు.. మంత్రి ఉత్తమ్‌కు నిరంజ‌న్ రెడ్డి కౌంటర్

by GSrikanth |
ఆ ప్రాజెక్టు కట్టింది నిజాం రాజు కాదు.. మంత్రి ఉత్తమ్‌కు నిరంజ‌న్ రెడ్డి కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌‌పై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించింది నిజాం రాజులు కాదని వనపర్తి రాజులు అని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ ప్రాజెక్టు ఎవరు కట్టారో కూడా నీటి పారుదల శాఖా మంత్రికి తెలియక పోవడం విచారకరం అని పేర్కొన్నారు. శాసనసభ సాక్షిగా అబద్దాలు ప్రచారం చేయడం కాంగ్రెస్ మంత్రులకు, పార్టీకి ఉన్న అవగాహనకు ఇది నిదర్శనమ‌న్నారు. కాగా, ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ప్రాజెక్టులపై అధికార.. విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

పదేళ్లలో ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ భ్రష్టు పట్టించిందని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకొని పబ్బం గడిపారని ఎద్దేవా చేశారు. దీంతో ఉత్తమ్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎక్కడ ఉందంటూ కౌంటర్ ఇచ్చారు. ఇరిగేషన్‌ మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం సత్యదూరంగా ఉందని విమర్శించారు. సభలో ఇచ్చిన పుస్తకం కూడా తప్పుల తడకగా ఉందని ఆరోపించారు.

Advertisement

Next Story