- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BJP: ప్రధాని మోడీని విమర్శించే స్థాయి CM రేవంత్‌కు లేదు

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీపై అర్థం లేని ఆరోపణలు సీఎం రేవంత్‌రెడ్డి చేయడం ఆయన స్థాయికి తగదని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మండిపడ్డారు. రాజకీయాల్లో సంచలనాల కోసం పాకులాడినట్లుగా ఉందని విమర్శించారు. రాహుల్‌గాంధీ కులం, మతం ఏమిటో ఇప్పటివరకు ఆయనకే తెలియదు, కనీసం రేవంత్‌రెడ్డి అయిన రాహుల్కులం చెప్పాలని అడిగారు. గుజరాత్‌లో నాటి కాంగ్రెస్‌ప్రభుత్వమే మోడీ కులాన్ని బీసీల్లో చేర్చిందని.. అది కూడా తెలుసుకోకుండా సీఎం మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో పార్టీ కార్యదర్శి బంగారు శృతితో కలిసి మాట్లాడుతూ.. రాష్ర్టంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయలేక, ప్రజలు మభ్యపెట్టేందుకు కొత్త డ్రామాలకు తెర లేపాడని మండిపడ్డారు. ఎన్నికల్లో ఈప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వెంట పడుతామని హెచ్చరించారు. పార్టీ అధ్యక్షులు ఎంపిక విషయంలో స్ధానిక నాయకుల అభిప్రాయాలు తీసుకొని ఎంపిక చేశామని ఇందులో ఎవరి ప్రమేయం లేదన్నారు. పార్టీ నాయకులు విబేధాలు ఉంటే పార్టీ పెద్దలకు చెప్పాలని, బహిరంగ విమర్శలు చేయడం సరికాదన్నారు.