మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి అరెస్ట్

by Mahesh |
మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం లోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్‌(Tribal Welfare Girls Hostel)లో ఫుడ్ పాయిజన్(Food poisoning) అయిన విషయం తెలిసిందే. కాగా ఘటన కారణంగా అస్వస్థతకు గురైన బాలికలను పరామర్శించేందుకు.. నేడు మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్(Satyavathy Rathore,), సబితాఇంద్రారెడ్డి(Sabita Indra Reddy)లు వెళ్లడానికి సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో వారిని వికారాబాద్‌లో పోలీసులు అడ్డుకొని విద్యార్థులను పరామర్శించడానికి వెళ్ళడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద మొత్తంలో చేరుకున్నారు. దీంతో తమ కార్యకర్తలతో కలిసి.. మర్రి చెన్నారెడ్డి విగ్రహం దగ్గర రోడ్డుపై బైఠాయించి నిరసన దిగారు. దీంతో పరిస్థితి అదుపు చేసేందుకు.. మాజీ మంత్రులు అయిన సత్యవతి రాథోడ్, సబితాఇంద్రారెడ్డి లను అరెస్ట్(Arrest) చేసి.. పోలీసు వాహనంలో హైదరాబాద్ తరలించారు. కాగా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసే క్రమంలో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణ నెలకొన్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story