- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RS ప్రవీణ్ కుమార్‌కు స్వాగతం పలికిన మాజీ మంత్రి
దిశ, వెబ్‌డెస్క్: బహుజన నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు బీఆర్ఎస్‌లోకి స్వాగతం పలుకుతున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో బహుజన నాయకత్వం బలంగా ఉందని అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కాంగ్రెస్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలిపారు. కొందరు బీఆర్ఎస్‌లో లాభం పొంది ఇతర పార్టీలోకి వెళ్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ను టార్గెట్ చేయడంలో భాగంగానే కవితను లిక్కర్ కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్‌కు అమలుపై శ్రద్ధ లేదని అన్నారు. కేసీఆర్ హయాంలోని కీలక పథకాలను పక్కనబెట్టే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ను ఎవరు వీడి వెళ్లినా నష్టం లేదని అన్నారు. తిరిగి మళ్లీ అంతే వేగంతో పుంజుకుంటామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటబోతున్నామని అన్నారు. మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.