Srinivas Goud: రేవంత్‌కు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు

by Gantepaka Srikanth |
Srinivas Goud: రేవంత్‌కు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు
X

దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్‌(KTR)ను అరెస్ట్ చేసే కుట్రలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీలో బీజేపీ(BJP) పెద్దలను కలిశారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ దొరకలేదు కానీ కేంద్రమంత్రుల దర్శన భాగ్యం దొరికిందని విమర్శించారు. అదానీతో తన సంబంధాలు బయటపెడుతున్నందుకే రేవంత్ కేటీఆర్‌పై కక్ష కట్టారన్నారు. ప్రజల గొంతుకగా పని చేస్తున్న కేటీఆర్‌ను రేవంత్ జైలుకు పంపాలనుకోవడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వమని విమర్శించారు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే రాష్ట్రంలో అభివృద్ధి అనేదే మిగలదన్నారు. కేసీఆర్(KCR) కక్ష సాధింపు రాజకీయాలు చేయాలంటే ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై సీఐడీ నివేదిక ఆధారంగా వేలమంది కాంగ్రెస్ నాయకులను జైల్లో వేసేవారని విమర్శించారు.

కేసీఆర్ కక్ష రాజకీయాల మీద దృష్టి పెట్టనందునే తెలంగాణ పదేళ్లలోనే ఇతర రాష్ట్రాలను తలదన్నేలా తెలంగాణ అభివృద్ధిని సాధించిదని తెలిపారు. రాష్ట్రంలో ఉచిత బస్సు తప్ప కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. చేతనైతే రేవంత్ కాంగ్రెస్ హామీల అమలుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కేటీఆర్ ఏది చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేశారన్నారు. అవినీతి బురద జల్లినంత మాత్రానా కేటీఆర్ పోరాట స్ఫూర్తిని దెబ్బతీయలేరన్నారు.

Advertisement

Next Story

Most Viewed