Satyavati: ఇది పిరికిపంద చర్య.. సర్కార్‌పై రెచ్చిపోయిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

by Gantepaka Srikanth |
Satyavati: ఇది పిరికిపంద చర్య.. సర్కార్‌పై రెచ్చిపోయిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
X

దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్‌లో బీఆర్ఎస్(BRS) ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్(Satyavati Rathore) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌(KTR) ధర్నా పిలుపుతో సీఎం రేవంత్‌ రెడ్డిలో వణుకు పుట్టిందని, మానుకోటలో బీఆర్‌ఎస్‌ ధర్నా చేస్తే రాష్ట్రమంతటా ప్రజలు ఆందోళనలు చేపడతారనే భయంతో అనుమతి ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) అధికారంలోకి వచ్చిన తరువాత శాంతి భద్రతలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు.

పోలీసుల అనుమతి నిరాకరణ నేపథ్యంలో మహాధర్నాను తాత్కాలికంగా వాయిదా వేశామని, త్వరలోనే 50 వేల మందితో నిర్వహిస్తామని సత్యవతి రాథోడ్‌ కీలక ప్రకటన చేశారు. అంతేకాదు.. ఇక నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్వహించబోయే సభలను అడ్డుకుంటామని అన్నారు. మొత్తం ప్లాన్ చేసుకున్నాక చివరి నిమిషంలో పోలీసులు ధర్నాకు అనుమతి నిరాకరించడం దారుణమైన విషయం అని తెలిపారు. హైకోర్టు(High Court)ను ఆశ్రయించి అనుమతి తెచ్చుకుంటామని అన్నారు. ఆందోళనలో మున్సిపల్‌ చైర్మన్‌ రాంమోహన్‌రెడ్డి , వైస్‌ చైర్మన్‌ మార్నేని వెంకన్న, యాళ్ల మురళీధర్‌రెడ్డి, రఘు, వెంకన్న, మంగళంపల్లి కన్న, వేణు, రవికుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed