- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జయంతి రోజున అంబేద్కర్ స్మృతి వనానికి తాళాలు వేస్తారా?.. నిరంజన్ రెడ్డి ఆగ్రహం
దిశ, వెబ్‌డెస్క్: పరిపాలన గాలికి వదిలేసి కాంగ్రెస్ నేతలు కండువాలు కప్పడంలో బిజీగా ఉన్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం.. పక్కనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టుకున్నాం. కానీ, ఆయన మహనీయుడి జయంతి రోజున విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించుకోకపోవడం దారుణమన్నారు. అంబేద్కర్ జయంతి రోజున స్మృతి వనానికి తాళాలు వేయడం ఏంటని మండిపడ్డారు. కేసీఆర్ పెట్టాడన్న అక్కసుతో ఇలా వ్యవహరిస్తారా? కేసీఆర్ కట్టిన వాటి పట్ల వ్యతిరేకత ఉంటే రేపటి నుండి సచివాలయంలో కూర్చోవడం మానేయండి అని మంత్రులపై నిరంజన్ రెడ్డి విమర్శలు చేశారు. ముందు నుంచి కూడా కాంగ్రెస్ నేతలకు అంబేద్కర్ అంటే గౌరవం లేదని అన్నారు.
స్వయంగా అంబేద్కర్ పోటీ చేసిన రోజుల్లో ఓడించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని గుర్తుచేశారు. దళితులను, మైనారిటీలను కాంగ్రెస్ కేవలం ఓటు బ్యాంకుగా భావిస్తున్నది.. ఎవరికైనా భ్రమలు ఉంటే తొలగించుకోవాలని సూచించారు. బీజేపీ మీద పోరాడే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదు.. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇక నుండి పోరాటం బీజేపీ మీద అని నిన్న చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలు కేసీ వేణుగోపాల్‌కు అర్దం కావు అన్నారు. కాంగ్రెస్ మిషన్ 15 అంటున్నారు.. చేతనైతే పక్కన ఒకటి తీసేసి 5 గెలిపించుకోండి అని సూచించారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నేతలు అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.