- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పల్లా స్పీచ్.. మల్లారెడ్డి కునుకుపాట్లు..! అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సమావేశాలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు కలిసి అసెంబ్లీకి ర్యాలీగా ఆటోలో వచ్చారు. మరోవైపు మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో నిరసనలు తెలిపారు.
తర్వాత అసెంబ్లీలో వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పీచ్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అందరూ పల్లా స్పీచ్ తీక్షణంగా వింటున్నారు. కానీ ఒకరు మాత్రం కునుకు తీస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి వెనుక సీటులో మాజీ మంత్రి మల్లారెడ్డి కూర్చుని ఉంటారు. కూర్చిలోనే కూర్చుని పల్లా స్పీచ్ వింటూ మల్లారెడ్డి కునుకు పాట్లు తీస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.