KTR: రైతులతో కలిసి మేమే మోటార్లు ఆన్ చేస్తాం.. కేటీఆర్ షాకింగ్ స్టేట్‌మెంట్

by Gantepaka Srikanth |
KTR: రైతులతో కలిసి మేమే మోటార్లు ఆన్ చేస్తాం.. కేటీఆర్ షాకింగ్ స్టేట్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం భేషజాలకు పోకుండా కాళేశ్వరం నీటిని వదలాలని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సూచించారు. శుక్రవారం ఆయన మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం నీటి విడుదల కోసం అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకూ పోరాటం చేస్తామని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి తామే మోటార్లు ఆన్ చేస్తామని ఆసక్తికర ప్రకటన చేశారు. 50 వేల మంది రైతులతో కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను ముట్టడిస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.

ఎన్డీఎస్‌ఏ రిపోర్ట్‌తో కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని.. అది అసలు ఎన్డీఎస్‌ఏ రిపోర్ట్ కాదని ఎన్డీఏ రిపోర్ట్ అని ఎద్దేవా చేశారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్ట్‌పై ఇంతవరకూ ఎన్డీఎస్‌ఏ రిపోర్ట్ ఇవ్వలేదని.. ఇంత తక్కువ సమయంలోనే మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై రిపోర్ట్ ఎలా ఇవ్వగలిగింది అని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజ్‌లో 10 లక్షల క్యూసెక్కుల నీరు ఉందని.. ప్రాజెక్ట్ కూడా పటిష్టంగా ఉందని స్వయంగా ఇంజినీర్లే చెబుతున్నారని గుర్తుచేశారు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీరు వదలాలని డిమాండ్ చేశారు.



Next Story