శానిటరీ కార్మికులతో కేటీఆర్ లంచ్

by GSrikanth |
శానిటరీ కార్మికులతో కేటీఆర్ లంచ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: శానిటరీ కార్మికులతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్ భోజనం చేశారు. అంతకు ముందు నూత‌న సంవ‌త్సర వేడుక‌ల‌ను సోమవారం తెలంగాణ భవన్‌లో కార్మికుల‌తో క‌లిసి జ‌రుపుకున్నారు. వారితో కాసేపు ముచ్చటించారు. సమస్యలను తెలుసుకున్నారు. కార్మికుల‌తో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం మూడుసార్లు శానిటరీ కార్మికులకు వేతనాలు పెంచిందన్నారు. పారిశుధ్య కార్మికులకు పెద్దపీట వేశామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సమస్యలను మేయర్‌కు చెబితే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. వేతనాలు పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు.

పలువురు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచితే కుటుంబ పోషణ సాధ్యమన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వంపై సమస్యలపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మెడికల్ లీవులు ఇచ్చేలా చూడాలని కోరినట్లు కార్మికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

కేటీఆర్‌ను కలిసిన పలువురు నేతలు

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌ను పలువురు నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు రాజీవ్ సాగర్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, నగేష్, బీఆర్ఎస్వీ నాయకులు శ్రీకాంత్ గౌడ్, తుంగబాలు, కాటం శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed