కాంగ్రెస్ చేతగానితనం శ్వేతపత్రంలో స్పష్టమైంది: కేటీఆర్

by GSrikanth |
కాంగ్రెస్ చేతగానితనం శ్వేతపత్రంలో స్పష్టమైంది: కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ చేతగాని తనం శ్వేతపత్రంలోనే స్పష్టమైందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ‌లో విద్యుత్ క‌ష్టాల‌కు కాంగ్రెస్ పార్టీనే కార‌ణం అని దుయ్యబట్టారు. గురువారం శాస‌న‌స‌భ‌లో విద్యుత్ రంగ ప‌రిస్థితిపై చ‌ర్చలో ఆయన మాట్లాడారు. నీళ్లు, బొగ్గు లేని రాయ‌ల‌సీమలో, బొగ్గు లేని విజ‌య‌వాడ‌లో థ‌ర్మల్ పవ‌ర్ కేంద్రాలు నెల‌కొల్పుతారని, తెలంగాణ‌లో ఆ రోజు విద్యుత్ కేంద్రాలు నిర్మించకుండా, రాష్ట్రం ఏర్పడే నాటికి 2700 మెగావాట్ల లోటు న‌ష్టాల‌తో అప్పజెప్పార‌న్నారు. 55 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ చ‌రిత్ర, నిర్వాకాన్ని వైట్ పేప‌ర్‌లో చాలా గొప్పగా స్పష్టంగా చెప్పిందని, మాకు ప్రజ‌లు పదకొండు సార్లు అవ‌కాశం ఇస్తే 2014 నాటికి ఆరు గంట‌ల క‌రెంట్ మాత్రమే ఇచ్చామ‌ని, అంత‌టి అస‌మ‌ర్థత‌, చేత‌కానిత‌నం మాది అని వారే ఒప్పుకున్నారని తెలిపారు. క‌డ‌ప‌లో రాయ‌ల‌సీమ థ‌ర్మల్ ప‌వ‌ర్ కేంద్రం పెట్టారని అక్కడ బొగ్గు ఉందా..? నీళ్లు ఉన్నాయా..? విజ‌య‌వాడ‌లో బొగ్గు ఉందా..? ఇవాళ బాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

మాన‌కొండూరు నియోజ‌క‌వ‌ర్గంలోని నేదునూరు, చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గంలోని శంక‌ర్‌ప‌ల్లిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు నెల‌కొల్పుతామ‌ని భూసేక‌ర‌ణ చేశారన్నారు. టీఆర్ఎస్ పార్టీగా ఆనాడు ఒక్క ద‌గ్గర ధ‌ర్నా చేయ‌లేదని, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ధ‌ర్నా చేయ‌లేదని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న గ్యాస్ ఆధారిత కేంద్రాలు ఎందుకు పెట్టడం లేదని నిర‌స‌న వ్యక్తం చేశామన్నారు. దేశంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం స‌ఫ‌ల‌మైందా..? నేదునూరులో గ్యాస్ అలాకేష‌న్ అయిందా..? ఆనాడు యూపీఏలో జైపాల్ రెడ్డి పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండి, గ్యాస్ అలాకేష‌న్ చేయ‌లేదన్నారు. గ్యాస్ అలాకేష‌న్ చేయ‌లేదు కాబ‌ట్టి ఆ రెండు ప్రాజెక్టులు టేకాఫ్ కాలేదని, ఇప్పుడు టేకాఫ్ చేయండి మీది ప్రభుత్వం అన్నారు. నేదునూరు, శంక‌ర్‌ప‌ల్లిలో ఇప్పుడు ఆ ప్రాజెక్టులు పెడుతామ‌ని ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చారు. ఇవాళ నోటికొచ్చిన‌ట్టు అవ‌మానిస్తున్నారని, అక్కడ అక్బరుద్దీన్ ఒవైసీని, ఇక్కడ మేం మాట్లాడుతుంటే మ‌మ్మల్ని సీఎం అవ‌మానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదీ చేసిన తెలంగాణకోసమే పనిచేశామన్నారు.

Advertisement

Next Story

Most Viewed