బీజేపీలో చేరడంపై మాజీ మంత్రి జోగురామన్న క్లారిటీ

by Javid Pasha |
బీజేపీలో చేరడంపై మాజీ మంత్రి జోగురామన్న క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 23న అమిత్ షా తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతున్నది. మరి కొన్ని నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమలం పార్టీ చేరికలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో అమిత్ షా పర్యటన సందర్భంగా పలువురు బీజేపీలో చేరబోతున్నారనే చర్చ జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని, అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారంపై జోగురామన్న ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. తాను బీజేపీలో చేరుతున్నాననే ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాజకీయ కుట్రతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిరాధార ఆరోపణలతో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అసత్యాలను ప్రసారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Advertisement

Next Story