ఎన్ని గేట్లు తెరిచినా మాకేం ఇబ్బంది లేదు: జగదీశ్ రెడ్డి

by GSrikanth |
ఎన్ని గేట్లు తెరిచినా మాకేం ఇబ్బంది లేదు: జగదీశ్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు వసూళ్లకు పాలించడానికి పనికిరారు అని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజులుగా బీఆర్ఎస్‌పై విమర్శలకే పరిమితం అయ్యారని అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేశామని గొప్పలు చెప్పుకోవడం కాదని.. అసలు ఒక్క గ్యారంటీ అయినా సక్రమంగా అమలు చేశారో లేదో చూసుకోవాలని హితవు పలికారు. వందరోజుల కాంగ్రెస్ పాలనకు పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండంగా భావించాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గేట్లు తెరిచినా బీఆర్ఎస్‌కు ఏమీ కాదని అభిప్రాయపడ్డారు. తాము టికెట్లు ఇవ్వడానికి నిరాకరించిన వారినే కాంగ్రెస్‌, బీజేపీలో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని మండిపడ్డారు.

Advertisement

Next Story