- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ వచ్చేది BRS ప్రభుత్వమే: హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంక్రటామిరెడ్డి గెలుపును కాంక్షిస్తూ హరీష్ రావు ఆదివారం మెదక్ సెగ్మెంట్ పరిధిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యకర్తలు మరో 15 రోజులు కష్టపడి మెదక్ ఎంపీగా వెంకట్రామిరెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరిరీ భయపడాల్సిన పని లేదని.. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ చేయాలని అడిగితే కాంగ్రెస్ మంత్రులు ఎలా తిడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తానని అన్నారు. సిద్దిపేట జిల్లాను రద్దు చేయాలని చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ, గ్యారెంటీలు అమలు చేస్తావో లేదో రేవంత్ రెడ్డి సొల్లు లేకుండా సీదాగా.. సూటిగా చెప్పాలన్నారు.
Read More...