- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నువ్వెంత, నీ బతుకెంతా.. బీజేపీ కార్యకర్తపై బాబుమోహన్ బూతుపురాణం
దిశ, డైనమిక్ బ్యూరో : నువ్వెంత, నీ బతుకెంతా. నువ్వొక గల్లీ లీడర్. నేనొక ప్రపంచస్థాయి నాయకుడిని. మన ఇద్దరి ఓటు బ్యాంక్ ఎంతో చూసుకుందామా అంటూ బీజేపీ కార్యకర్తపై మాజీ మంత్రి బాబుమోహన్ బూతుపురాణం సంధించిన ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో తీవ్ర వివాదాస్పదమవుతుంది. మీతో పని చేస్తానని చెప్పిన పాపానికి నువ్వెంత నీ బతుకెంత అంటూ మాజీ మంత్రి బూతులు తిట్టారు. ఇంకోసారి తనకు ఫోన్ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరింపులకు పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళితే, ఆందోల్‌కి చెందిన బీజేపీ కార్యకర్త వెంకటరమణ మాజీ మంత్రి బాబుమోహన్‌కి కాల్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేసిన ఆయన... చెప్పు తమ్ముడు అంటూ బదులివ్వగా.. తొలుత ఇద్దరి మధ్య సంభాషణ సజావుగానే సాగింది. ఈ నేపథ్యంలో వెంకటరమణ మాట్లాడుతూ... మీతో కలిసి పని చేయడం కోసం ఫోన్ చేశానని చెప్పాడో లేదో, ఇక బాబుమోహన్ బూతుపురాణం మొదలెట్టారు. నువ్వెంత? నీ బతుకెంత? అంటూ కార్యకర్తను దూషించడం ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసేందుకు అమిత్ షా తనను బీజేపీలో చేర్చుకున్నారని..తానొక ప్రపంచస్థాయి నాయకుడిని అంటూ కార్యకర్తపై విరుచుకుపడ్డారు.
తాను ఎన్నో పనులు చేశానని చెప్పగా... నేను పుట్టినపుడు నీ వయసెంత అని నిలదీశారు. జోగిపేటకు నువ్వేం చేయగలవు? నీకు ఎన్ని ఓట్లు? అని ప్రశ్నించారు. తనకు 2 వేల ఓట్లు వచ్చాయని బదులివ్వగా.. నీ స్థాయి ఎంత అంటూ మండిపడ్డారు. నువ్వు నాతో మాట్లాడ్డానికి అనర్హుడివి అంటూ కార్యకర్తను చిన్నచేసి మాట్లాడారు. ఈ క్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌పై కూడా కామెంట్స్ చేశారు. సంభాషణ మధ్యలో కార్యకర్త వెంకటరమణ బండి సంజయ్ పేరు ప్రస్తావించగా..'బండి సంజయ్ ఎవడ్రా..వాడు నా తమ్ముడు'అని బాబుమోహన్ బదులిచ్చారు. ఇంకోసారి తనకు ఫోన్ చేస్తే జోగిపేటలో చెప్పుతీసుకుని కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు.
అవసరమైతే బీజేపీకి రాజీనామా చేస్తానన్న ఆయన.. ఫోన్ పెట్టేయ్ నువ్ అంటూ కార్యకర్తతో మర్యాద లేకుండా ప్రవర్తించారు. కాగా, సంభాషణ మధ్యలో కార్యకర్త వెంకటరమణ మాట్లాడుతూ తాను కొంత కాలంగా బీజేపీలో ఉన్నానని, కార్యకర్తగా కష్టపడుతున్నానని వెంకటరమణ చెప్తున్నా వినిపించుకోకుండా బాబుమోహన్ దూషిస్తునే ఉన్నారు. కావాలంటే దీనిని రికార్డు చేసి ఎక్కడైనా పెట్టుకో అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇంకో సారి తనకు కాల్ చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. చివరికి ఫోన్ పెట్టేయ్ రా గాడిద, వెదవ అంటూ ఆయనే ఫోన్ కట్ చేశారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇక దీనిపై బీజేపీ శ్రేణులు ఏ వింగా స్పందిస్తాయో చూడాలి
Also Read..