- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి.. ఆ జిల్లాలో బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బ!
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీకి బుధవారం మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దీపా మున్షీ సమక్షంలో ఇంద్రకరణ్ రెడ్డి హస్తం పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ లో చేరిన తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో ఇంద్రకరణ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. వీరితో పాటు ఇంఛార్జీ దీపా దాస్ మున్షీ, ఎమ్మెల్యే కొమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇతర పార్టీ నేతలు ఉన్నారు. అనంతరం తాజాగా రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించినట్లు తెలిసింది.
కాగా, లోక్ సభ ఎన్నికల వేళ ఇప్పటికే బీఆర్ఎస్‌ను కీలక నేతలు వీడడంతో పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. తాజాగా కాంగ్రెస్‌లో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బలమైన నేత కారు దిగేయడం బీఆర్ఎస్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ అని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.