- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌లోకి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య.. చేరికకు మహూర్తం ఖరారు
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌కు రాష్ట్రంలో అత్యంత పట్టున్న జిల్లాలో కీలక నేత పార్టీ మారడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నారు. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేకాదు.. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చర్చలు జరిపిన ఆయన.. తీవ్రంగా ఆలోచించి.. అనుచరులు, అభిమానుల అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు విస్తృతమయ్యాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ నెల 10వ తేదీన హస్తం తీర్థం తీసుకోవడానికి ముహూర్తం సైతం ఖరారు చేసుకున్నారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ కోసం రాజయ్య తీవ్రంగా ట్రై చేశారు. చివరి వరకు ఎదురుచూసి నిరాశ చెందారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గ టికెట్‌ను కడియం శ్రీహరికి అప్పగించారు. దీంతో అప్పటినుంచి అసంతృప్తితో రగిలిపోతున్న ఆయనకు పార్టీ పెద్దలు సర్దిచెబుతూ వస్తున్నారు. దీంతో ఇంతకాలం మౌనంగా ఉన్న ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు అధిష్టానానికి పంపారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ కేటాయించేందకు అధిష్టానం సుముఖంగా లేకపోవడంలో ఇక గుడ్ బై చెప్పడమే సరైన నిర్ణయం అని భావించి పార్టీ మార్పునకు సిద్ధమయ్యారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.