నల్లగొండకు బయల్దేరిన మాజీ సీఎం కేసీఆర్.. సభాస్థలిలో ఉద్రిక్తత

by GSrikanth |   ( Updated:2024-05-31 07:36:38.0  )
నల్లగొండకు బయల్దేరిన మాజీ సీఎం కేసీఆర్.. సభాస్థలిలో ఉద్రిక్తత
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండకు బయల్దేరారు. తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సులో ఆయన వెళ్తున్నారు. ఇదిలా ఉండగా.. నల్లగొండ కేసీఆర్ సభలో కలకలం రేగింది. ఇవాళ ఉదయమే అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్‌లు వీటి కాలనీ నుంచి సభా స్థలికి వెళ్తుండగా కొందరు యూత్ కాంగ్రెస్ నాయకులు అడ్డుతగిలారు. నల్లజెండాలు ప్రదర్శిస్తూ ‘‘కేసీఆర్ గో బ్యాక్.. కేసీఆర్ గో బ్యాక్’’ అంటూ ప్లకార్డులు పట్టుకొని భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వారు ప్రయాణిస్తున్న బస్‌పై కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో వీటి కాలనీ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

కృష్ణా జలాల పరిరక్షణ కోసమే నల్లగొండలో కేసీఆర్ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభలో పాల్గొనేందుకు ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా తరలివెళ్తున్నారు. నల్లగొండ పట్టణ శివారులో నార్కట్‌పల్లి-అద్దంకి హైవేకు అనుకుని మర్రిగూడ బైపాస్‌లో విశాలమైన స్థలంలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ సభకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

Advertisement

Next Story