KCR : నల్లగొండ సభలో కేసీఆర్ మార్క్..!

by Ramesh N |   ( Updated:2024-02-13 13:39:01.0  )
KCR : నల్లగొండ సభలో కేసీఆర్ మార్క్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండలో బహిరంగ సభ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటి సారిగా సభ నిర్వహించారు. రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి మొదటి సారిగా మాట్లాడారు. అయితే ఈ సభలో కూడా కేసీఆర్ తన మార్క్ చూపించారు.

ఎవరైనా కేసీఆర్ సభలో లొల్లి పెట్టిన.. విజిల్స్ వేసిన వారిపై ఆగ్రహం వ్యక్తంచేస్తారు.. వారిని పొట్టు పొట్టు తిడుతాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తాజాగా మరోసారి నల్గొండ సభలో లొల్లి పెట్టిన వారిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘అరే ఆగురా బాయ్ ఆగు.. ఆపవయ్యా రాజేశ్వర్ రెడ్డి.. అరె ఎవడయ్య వాడు.. ఇది సభ రా బాబు.. ఎందుకయ్య పిచ్చోలు ఆడా’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

Advertisement

Next Story

Most Viewed