CM రేవంత్ నా గుడ్లు పీకుతా అంటే కనిపించలేదా..? కేసీఆర్ ఫైర్

by Satheesh |   ( Updated:2024-05-01 17:23:11.0  )
CM రేవంత్ నా గుడ్లు పీకుతా అంటే కనిపించలేదా..? కేసీఆర్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఈసీ విధించిన నిషేదంపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. నేను ప్రచారం చేయకుండా ఈసీ నాపై 48 గంటల నిషేధం విధించింది.. మరీ సీఎం రేవంత్ రెడ్డి నా గుడ్లు పీకుతా.. పేగులు మెడకు వేసుకుంటానంటే ఆయనపై మాత్రం నిషేధం విధించలేదని అన్నారు. నా ప్రచారంపై ఈసీ 48 గంటల నిషేధం విధిస్తే.. బీఆర్ఎస్ కార్యకర్తలు 92 గంటలు విశ్రాంతి లేకుండా పని చేస్తారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మహబూబాబాద్ జిల్లాలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లాను తీసేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు, మరీ మహబూబాబాద్ జిల్లాగా ఉండాలంటే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పాలనలో మహబూబాబాద్‌కు నీళ్లు వచ్చేవి కావని.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాకే మహబూబాబాద్ జిల్లాకు నీళ్లు వచ్చాయన్నారు. ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, అడ్డగోలు హామీలు ఇచ్చి గెలిచారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపించారని ధ్వజమెత్తారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని, ధాన్యం కొనకపోవడం వల్ల కరీంనగర్‌లో ఒకరైతు గుండె ఆగి చనిపోయారనని మండిపడ్డారు. ప్రభుత్వం ఒక పథకం తీసుకువస్తే మరొకరి ఇబ్బంది ఉండొద్దని హితవు పలికారు.

Read More...

కేసీఆర్ ఓయూ‌కు చేసింది శూన్యం: చనగాని దయాకర్

Advertisement

Next Story