కవితకు మద్దతు ప్రకటించిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి

by Sathputhe Rajesh |   ( Updated:2024-03-16 16:19:38.0  )
కవితకు మద్దతు ప్రకటించిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ శుక్రవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం నుంచి ఈడీ, ఐటీ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టి.. సాయంత్రం 5.20 గంటలకు కవితను అరెస్ట్ చేసినట్లు భర్తకు నోటీసులు అందించాయి. రాత్రి ఢిల్లీకి ఫ్లైట్‌లో కవితను ఈడీ అధికారులు తరలించారు. అయితే కవిత అరెస్ట్‌ అంశంపై యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ వేదికగా కవితకు మద్దతు ప్రకటించారు. ‘ఓటమి భయంతోనే ప్రతిపక్ష పారీలను బీజేపీ టార్గెట్ చేసింది. ఎంత పెద్ద మొత్తంలో ప్రతిపక్షాలపై దాడి చేస్తుందో.. అంతే పెద్ద మొత్తంలో ఆ పార్టీ ఓటమిని చవిచూస్తుంది.’ అంటూ ట్వీట్ చేశారు. ట్వీట్‌ను అకౌంట్లకు ట్యాగ్ చేశారు.

Advertisement

Next Story