సీఎం రేవంత్ రెడ్డిపై గాదరి కిశోర్ సంచలన వ్యాఖ్యలు

by Anjali |   ( Updated:2024-07-10 09:47:16.0  )
సీఎం రేవంత్ రెడ్డిపై గాదరి కిశోర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత వారం నుంచి నిరోద్యోగులు గ్రూప్-1 లో పోస్టులు పెంచాలని, డీఎస్సీని వాయిదా వేయాలని, నీట్ ఎగ్జామ్ వాయిదా వేయాలని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు విద్యార్థి సంఘాల్ని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. మొన్న హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సీటీలో డీఎస్సీ అభ్యర్థులు రాత్రంతా డీఎస్సీ వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంది. నిరుద్యోగులు తిండి తిప్పలు లేకుండా రాత్రి పగలని చూడకుండా ధర్నాలు చేపడుతుంటే ఈ క్రమంలో నిరుద్యోగులను రేవంత్ రెడ్డి.. విద్యార్థులను, నిరుద్యోగులను సన్నాసులని అవమానిస్తున్నాడని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను అవమానించడం ఏమాత్రం సరైంది కాదని ఆయన సీఎంపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నిరుద్యోగుల కోసం ఆనాడు రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్‌లో తిప్పినప్పుడు.. ఆ రోజు రాహుల్ గాంధీ సన్నాసా? రేవంత్ రెడ్డి సన్నాసా? అని అని రేవంత్ కు సెటైరికల్ ప్రశ్న విసిరారు.


Trending: ట్విట్టర్‌లో ఏపీ మంత్రి సత్యకుమార్ మాస్ ర్యాగింగ్.. తట్టుకోలేక ఏకంగా బ్లాక్ చేసిన కేటీఆర్

Advertisement

Next Story