HYD: బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట తీవ్ర విషాదం

by GSrikanth |   ( Updated:2023-04-25 03:59:39.0  )
HYD: బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట తీవ్ర విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రభాకర్ తండ్రి ఎన్‌జే మురళీధర్ రావు కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించి సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. కాగా, మురళీధర్ రావు ప్రిన్సిపల్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. విషయం తెలిసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాపం ప్రకటించారు.


Advertisement

Next Story