- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌లో హిందూ వ్యతిరేక భావన ఉంది: చింతల
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్‌లో హిందూ వ్యతిరేక భావన ఉందని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి అన్నారు. బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను విభజించి ఓట్ల దండుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ చేసిందన్నారు. విభజన చేసిన పాలించడమనేది కాంగ్రెస్‌లో ఎప్పటి నుంచో కొనసాగుతోందన్నారు. ముస్లింలకు వ్యతిరేకమని గతంలో భారతీయ జన సంఘ్ పార్టీపైనా కాంగ్రెస్ ఆరోపణలు చేసిందని గుర్తు చేశారు. అసలు బజరంగ్ దళ్‌ను ఎందుకు బ్యాన్ చేయాలని ప్రశ్నించారు. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఎక్కడైనా దాడులకు పాల్పడితే చూపించాలన్నారు.
బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేయాలని కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో కాంగ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. గౌరీ లంకేశ్ హత్యకు, బీజేపీకి ఏం సంబంధమన్నారు. కేసును పట్టించుకోలేదని ఆధారాలుంటే కోర్టుకు వెళ్లొచ్చని చెప్పారు. మతమనేది వ్యక్తిగతమని, తన మతం గురించి తాను చెప్పుకుంటే ఎలా తప్పు అవుతుందో చెప్పాలని చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మతం గురించి చెప్పుకునే స్వేచ్ఛ లేదా అని వ్యాఖ్యానించారు. ముస్లిం పార్టీలతో కాంగ్రెస్ ఉందన్నారు. మత రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ప్రజలకు అర్ధమవుతుందని చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
Read More: బీఆర్ఎస్ నేతలకు బిగ్ షాక్.. ఆసక్తికర వీడియో విడుదల చేసిన బండి సంజయ్! (వీడియో)
బుల్లెట్ బండిపై సెక్రటేరియట్‌కు రాజా సింగ్.. గేటు దగ్గరే అడ్డుకున్న పోలీసులు