- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో టీడీపీ అవసరం ఉంది.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అవసరం ఉందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.బుధవారం ఖమ్మంలో జరిగిన టీడీపీ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ గడ్డ మీదే టీడీపీ పురుడు పోసుకుందని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పాలనలో రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిందన్నారు. కొత్త కొత్త సంస్కరణలు టీడీపీ హయాంలోనే వచ్చాయని తెలిపారు. అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేసిన నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. పార్టీ పెట్టిన 9 నెలల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఎన్టీఆర్.. ఫుడ్ సెక్యూరిటీకి బీజం వేసి రూ.2లకే బియ్యం ఇచ్చారని చెప్పారు. తెలంగాణలో పటేల్, పట్వారి వ్యవస్థను నిర్మూలించారని చంద్రబాబు అన్నారు. రూ.50లకే కరెంట్ ఇచ్చామన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీల కోసం గురుకుల పాఠశాలను తెచ్చారని అన్నారు. పేదలకు పక్కా ఇండ్లు కట్టించి.. చరిత్ర సృష్టించామన్నారు.
టీడీపీ హయాంలోనే హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చాం
ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చామని చంద్రబాబు చెప్పారు. హైటెక్ సిటీని 14 నెలల్లోనూ పూర్తి చేశామన్నారు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి వారిని హైదరాబాద్ కు తీసుకొచ్చానని చెప్పారు. ఐఎస్ బీ, ఔటర్ రింగ్ రోడ్డు, గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇలా ప్రతి దాంట్లో టీడీపీ ప్రభుత్వం పాత్ర ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. తాను వయసులో పెద్దవాడినైనా తన ఆలోచనలు మాత్రం యువకుడిలా ఉంటాయని అన్నారు. నందమూరు తారకరామారావు వందేళ్ల జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నామని బాబు అన్నారు. ఎన్టీఆర్ వ్యక్తి కాదు శక్తి అని..ఆయన ఒక వ్యవస్థ అని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన ఉంటారని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ అధికారం కోసం పార్టీ పెట్టలేదని.. తెలుగు జాతి అవమానం పాలవుతుందని పెట్టారని అన్నారు.
READ MORE :
టీడీపీలో చేరికపై కాంగ్రెస్ సీనియర్ నేత షాకింగ్ కామెంట్స్