- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bhadradri Flooding: వరదలో చిక్కుకున్న ఐదుగురు.. చెట్ల పైకి ఎక్కి సాయంకోసం అరుపులు
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు గోదావరి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లోని ప్రధాన నదులు, డ్యామ్ లు నిండు కుండల్లా మారిపోయాయి. ఈ క్రమంలోనే భద్రాద్రి జిల్లాలో ఉన్న బచ్చువారిగూడెం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో పెద్దవాగు ప్రాజెక్టు పై ఉన్న గేట్లను ఎత్తడంతో ఒక్కసారిగా వరద పెరిగిపోయింది. దీంతో ఐదుగురు పశువుల కాపరులు వాగులో చిక్కుకున్నారు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడే ఉన్న చెట్టు పైకి ఎక్కారు. ఈ క్రమంలో వరద ఉధృతి అంతకు అంతా పెరుగుతుండటంతో తమని కాపాడాలని చెట్లపై నుంచి వారు కేకలు వేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది.
Advertisement
Next Story