విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి

by Naveena |
విద్యుత్ ఉప కేంద్రాలను  ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి
X

దిశ, రేవల్లి/గోపాల్ పేట: వనపర్తి జిల్లా రేవెల్లి,గోపాలపేట మండలం ఎదుట్ల, తలుపునూరు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ విద్యుత్ ఉప కేంద్రాన్ని 2.4 కోట్లు అంచనా వ్యేయంతో రెండు విద్యుత్ ఉప కేంద్రలు..కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈ సబ్ స్టేషన్ ల ద్వారా ఉమ్మడి మండలంలోని గ్రామాల పరిధిలోని గృహ, వ్యవసాయ భూములకు కరెంట్ కష్టాలు తీరనున్నాయి.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ సిఎండి ముషారఫ్ అలీ, జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి, జిల్లా ఎస్పీ గిరిధర్ రావుల, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, , మహబూబ్నగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, విద్యుత్ శాఖ సీఈ యు. బాలస్వామి, డైరెక్టర్ నందకిషోర్, ఎస్ ఈ రాజశేఖరం, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జిల్లా అధికారులు, ఉమ్మడి మండల ఇంచార్జ్ సత్యసిల్లారెడ్డి, మండల అధ్యక్షుడు గుండ్రాతి గణేష్ గౌడ్, రేవెల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వాడల పర్వతాలు, గోపాల్పేట టౌన్ అధ్యక్షుడు శివన్న, ఉపాధ్యక్షుడు మంగ దొడ్డి నాగ శేశి యాదవ్,ఎస్సీ సెల్ అధ్యక్షులు వెంకటేశు,యూత్ అధ్యక్షుడు ఎండి బాల పీరు, మండల అధ్యక్షులు సుధాకర్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేతేపల్లి వెంకటయ్య హోటల్ సీను,జైపాల్ రెడ్డి, విష్ణువర్ధన్ బంగారయ్య, భాస్కర్, కోదండం కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story