- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారత సాంప్రదాయ క్రీడలను కాపాడుకోవాలి : ఎమ్మెల్యే రేవూరి
దిశ,గీసుగొండ : మన భారతీయ సాంప్రదాయ క్రీడలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ క్రీడలను భవిష్యత్ తరాలకు అందించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గీసుగొండ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 57వ తెలంగాణ సీనియర్ అంతర్ జిల్లా ఖోఖో ఛాంపియన్షిప్ పోటీలు తెలంగాణ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ పోటీలను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ క్రీడలకు పెద్దపీట వేస్తుందని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు.
క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు మానసిక వ్యక్తిత్వ వికాసం కలుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. 57వ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను గీసుగొండలో నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు. ఖోఖో పోటీల నిర్వహణకు సహాయ సహకారాలు అందించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు,ఖోఖో టోర్నమెంట్ చైర్మన్ అల్లం బాలకిషోర్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పెండింగ్ లో ఉన్న క్రీడా బిల్లులు ఇప్పించుటకు కృషి చేస్తానని అన్నారు.
మొగిలిచర్లలో స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తాం.. : కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి
57వ తెలంగాణ సీనియర్ అంతర్ జిల్లా ఛాంపియన్షిప్ ప్రారంభ వేడుకలలో కుడా చైర్మన్ ఇనగల వెంకట్రామిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ... త్వరలోనే మొగిలిచర్లలో సీఎం ఆదేశాల మేరకు కుడా సంస్థ తరఫున స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తామని తెలిపారు. అదేవిధంగా గీసుగొండలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దేశీయ క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది అని కే లో ఇండియా ద్వారా చాలామంది క్రీడాకారులు వివిధ క్రీడలలో తమ ప్రతిభను కనబరిచారని, ఈ ఛాంపియన్షిప్ యువ అథ్లెట్లకు పోటీపడే అవకాశం కల్పించిందన్నారు. తెలంగాణ సీనియర్ అంతర్ జిల్లా ఖోఖో ఛాంపియన్షిప్ లో ప్రతిభావంతులైన యువకులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఇలాంటి వేదికను అందించడం గర్వంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫైనాన్స్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మహమ్మద్ ఖాన్, జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్, ఖోఖో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కన్వీనర్ వీరగోని రాజ్ కుమార్,అల్లం స్వప్న దేవి బాలకిషోర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ బీమాగాని సౌజన్య, వరంగల్ ఒలంపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కైలాష్ యాదవ్, మాజీ జడ్పీటీసీ పోలీస్ ధర్మారావు, అల్లం మర్రెడ్డి, మాజీ సర్పంచ్ దౌడు బాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.