తెలంగాణలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సెంటర్..

by Vinod kumar |
తెలంగాణలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సెంటర్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి చొరవతో హైదరాబాదులో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సెంటర్‌ను డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ విభాగం మంజూరు చేసింది. ఈ తరహా ట్రైనింగ్ సెంటర్ ఇప్పటి వరకు తెలంగాణలో సింగరేణి ప్రాంతమైన గోదావరిఖనిలో మాత్రమే ఉంది. మైనింగ్ ఇంజనీర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి ప్రత్యేక చొరవతో దేశంలో తొలిసారిగా ఇంజినీర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సెంటర్ ను నిర్వహించడానికి అనుమతి లభించడం విశేషం.

మొదటి బ్యాచ్‌ను శుక్రవారం అసోసియేషన్ జాతీయ స్థాయి నాయకులు ప్రారంభించారు. ప్రథమ చికిత్స పరీక్ష తప్పనిసరి అయి ఉన్న మైనింగ్ అధికారులు, సూపర్వైజర్లకు, మైనింగ్ విద్యార్థులు, పోలీసులకు ఈ సెంటర్ అందుబాటులోకి రావడం ఒక మంచి అవకాశంగా పేర్కొనవచ్చు. ఇప్పటివరకు ఫస్ట్ ఎయిడ్ పరీక్ష పాస్ అవ్వాలంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న సెంటర్లకు వెళ్ళవలసి వస్తుండేది. ఇంజినీర్స్ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ చెందిన నాయకులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని తమ కార్యాలయంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి ప్రత్యేక చొరవచూపి సాధించారు.


తొలి బ్యాచ్ ప్రారంభోత్సవ సందర్భంగా అసోసియేషన్ జాతీయ మాజీ అధ్యక్షుడు వి.ఎస్. రావు, ఎండి. ఫసీయుద్దీన్, మాట్లాడుతూ.. ఇంజినీర్స్ అసోసియేషన్స్ వారు ఇటువంటి వినూత్న కార్యక్రమం చేపట్టడం పై అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ బీఆర్వీ సుశీల్ కుమార్ మాట్లాడుతూ.. ఇంజినీర్స్ అసోసియేషన్ వారు దశాబ్దాల కాలంగా ఇంజినీర్ల వృత్తి నైపుణ్యం పెంచడంలోను, ఖనిఖ పరిశ్రమల అభివృద్ధికి ఆధునికతకు దోహదపడేలా సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారని, వీటితో పాటు దేశంలో తొలిసారిగా ఇటువంటి సెంటర్ను ఏర్పాటు చేసి, తక్కువ ఖర్చుతో శిక్షణ, పరీక్షలు నిర్వహించబూనడం అభినందనీయమన్నారు.

ఈ సెంటర్ ఏర్పాటుకు విశేషమైన కృషి చేసిన అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన, సెక్రటరీ జనరల్ ఎం. నర్సయ్య, హైదరాబాద్ చాప్టర్ వైస్ ఛైర్మన్ వెంకట్రామయ్య, సెక్రెటరీ, కార్యదర్శి బి. మహేశ్ ప్రత్యేక చొరవ, కృషిని అభినందించారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయడంతో పాటు సీనియర్ డాక్టర్ నవీన్ సారథ్యంలో శిక్షణ తరగతులను నిర్వఇస్తున్నమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని జాతీయస్థాయి సెక్రటరీ జనరల్ ఎం నరసయ్య, చాప్టర్ కార్యదర్శి బీ మహేష్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story