జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం‌లో అగ్ని ప్రమాదం

by Sathputhe Rajesh |
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం‌లో అగ్ని ప్రమాదం
X

దిశ, మంచిర్యాల టౌన్‌: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గుడిపెట్‌లో గల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో మలేరియా విభాగానికి చెందిన ప్రత్యేక వార్డ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరగడంతో మలేరియా పిచికారికి ఉపయోగించే కిట్లు, మందులు, యంత్రాలు కాలిపోయాయి. స్థానికుల నుండి సమాచారం అందడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. సుమారు రూ. 5లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.

Advertisement

Next Story