- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
FIR Filed: స్టేట్ పాలిటిక్స్‌లో మరో సంచలనం.. మాజీ మంత్రి హరీశ్‌రావుపై కేసు నమోదు
దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాంపింగ్ కేసు (Phone Tapping Case) రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న తరుణంలోనే మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao)తో పాటు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు (Radha Kishan Rao)లపై తాజాగా, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ (Panjagutta Police Station)లో కేసు నమోదైంది. సిద్దిపేట (Siddipet)కు చక్రధర్ గౌడ్ (Chakradhar) అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హరీశ్‌రావు, రాధాకిషన్ రావుపై 120 (B), 386, 409, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తన ఫోన్‌ను హరీశ్ రావు, రాధాకిషన్ రావు ఆదేశాల మేరకు పోలీసులు ట్యాప్ చేశారని చక్రధర్ గౌడ్ తన ఫిర్యాదులో వెల్లడించారు. అదేవిధంగా తనపై అక్రమ కేసులు బనాయించి మానసికంగా వేధించారని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులకు గురి చేశారని చక్రధర్ గౌడ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద హరీశ్ రావు, రాధాకిషన్ రావులపై కేసు నమోదయ్యాయి.