తెలంగాణలో అమిత్ షాపై ఎఫ్ఐఆర్.. రాజాసింగ్ రియాక్షన్ ఇదే

by Disha Web Desk 13 |
తెలంగాణలో అమిత్ షాపై ఎఫ్ఐఆర్.. రాజాసింగ్ రియాక్షన్ ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చిన్న పిల్లలను ఎన్నికల ప్రచారంలో భాగస్వాములను చేశారనే ఆరోపణలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ పై మొగల్ పురా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై రాజాసింగ్ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు ఎవరో ఇచ్చి ఫేక్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. వారి ఆరోపణలు అబద్ధం అని అమిత్ షా ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ పూర్తిగా పాటించారన్నారు. ఎన్నికల ర్యాలీ సందర్భంగా తన స్పీచ్ అయిపోయాక అక్కడ అనేక మంది చిన్నారులు ఉంటే వారు ప్రేమతో దగ్గరకు తీసుకుని వారితో ఫోటో మాత్రమే తీయించుకున్నారని ఎక్కడా ఆ చిన్నారుల చేతిలో బీజేపీ జెండాలు లేవని వారు బీజేపీ నినాదాలు చేయలేదన్నారు. ఈ మేరకు తాజాగా రాజాసింగ్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇదే కాంగ్రెస్ నేతలు గల్లీ గల్లీకి మధ్యం పంచుతున్నారని, కాంగ్రెస్ కు ఓటు వేయాలని డబ్బులు పంచుతున్నారని ఎంత మంది కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు చేశారని తెలంగాణ పోలీసులను ప్రశ్నించారు. మొఘల్ పూరా పోలీసులు ఏ లెక్కన ఎఫ్ఐఎస్ నమోదు చేశారో అర్థం కావడం లేదన్నారు. ఈ అంశంలో తాము కోర్టుకు వెళ్తామన్నారు.

ఈ నెల 1వ తేదీన అమిత్ షా లాల్ దర్వాజా మహంకాళి దేవాలం నుంచి సుధా థియేటర్ సమీపంలోని లైబ్రరీ వరకు జరిగిన బీజేపీ రోడ్ షోలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ర్యాలీలో అమిత్ షా ర్యాలీలో నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రచార ర్యాలీలో చిన్నారులు పాల్గొనడంపై కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ సీఈవో వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మొఘల్ పురా పోలీసులు అమిత్ షాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న వారిపై కేసు నమోదు చేశారు.

Next Story

Most Viewed