ముగిసిన గ్రాడ్యుయేట్ MLC బై పోల్.. ఎంతశాతం ఓటింగ్ నమోదు అయ్యిందంటే..?

by Satheesh |
ముగిసిన గ్రాడ్యుయేట్ MLC బై పోల్.. ఎంతశాతం ఓటింగ్ నమోదు అయ్యిందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ముగిసింది. సోమవారం ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు సాగింది. ఈసీ రూల్స్ ప్రకారం సాయంత్రం 4 గంటల లోపు పోలింగ్ బూత్‌లో ఉన్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రస్తుతానికి 68.65 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఈసీ వెల్లడించింది. కొన్ని బూత్‌లలో ఇప్పటికీ ఓటర్లు క్యూలో ఉండటంతో పూర్తిస్థాయి పోలింగ్ శాతం వివరాలు వెల్లడి అయ్యేందుకు ఆలస్యమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికను బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి, బీజేపీ నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలోకి దిగారు. జూన్ 5న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం రానుంది.

Advertisement

Next Story

Most Viewed