- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 12 వేల కోట్ల పాత అప్పుల్ని తీర్చేశాం
దిశ, తెలంగాణ బ్యూరో: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్‌పై ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కొన్ని వివరాలను వెల్లడించారు. బడ్జెట్‌ను సమర్పించిన అనంతరం లాబీల్లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేస్తూ... ఇప్పుడు పెట్టిన బడ్జెట్‌ను నాలుగు నెలల అవసరాలకు మాత్రమే ఉద్దేశించి పెట్టామన్నారు. గ్యారంటీల అమలుకు కేటాయించిన నిధులు ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఒక్కో స్కీమ్‌కు మార్గదర్శకాలు రూపొందిన తర్వాత వాటి అంచనా వ్యయంలో మార్పులు ఉంటాయన్నారు. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం తన ప్రసంగంలోనే క్లారిటీ ఇచ్చారన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ను జూలైలో పెట్టనున్నందున అప్పటికి కొన్ని మార్పులు, సవరణలు ఉంటాయన్నారు.
నాలుగు నెలల అవసరాలతో పాటు ప్రభుత్వ విజన్‌కు అనుగుణంగా కొన్ని శాఖలకు కేటాయింపులు ఉన్నాయన్నారు. ఇప్పటికే కొత్త ఉద్యోగాలకు నియామక పత్రాలను ప్రభుత్వం అందజేసిందని, త్వరలోనే మరికొన్ని పోస్టులు కూడా భర్తీ కానున్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకని ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి రేటు తగ్గిందని, ఇందుకు పలు కారణాలు ఉన్నాయన్నారు. గ్రోత్ రేట్ తగ్గినంత మాత్రాన రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరుల విషయంలో గాభరా పడాల్సిన అవసరం లేదన్నారు. రెవెన్యూ ఆర్జించడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నారు.
గత ప్రభుత్వం కంటే ఎక్కువ అప్పు తీసుకునేలా ఓటాన్ అకౌంట్‌లో చేసిన ప్రస్తావన గురించి వివరణ ఇస్తూ.. గత ప్రభుత్వం చేసిన అప్పుల్లో దాదాపు రూ. 12 వేల కోట్ల మేర తీర్చేశామని, ప్రతి నెలా ‘అసలు’ (ప్రిన్సిపల్)ను తీర్చడానికి బడ్జెట్‌లోనే కేటాయింపులు ఉన్నాయన్నారు. ఈ కారణంగానే కొత్త అప్పులు తీసుకోడానికి మార్గం సుగమమైందన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆఫ్-బడ్జెట్ బారోయింగ్స్ ను తీరుస్తూ ఉన్నందున ఎఫ్ఆర్‌బీఎం పరిమితికి కేంద్రం విధించిన ఆంక్షలు తగ్గిపోతూ ఉన్నాయని, అందువల్లనే ఓపెన్ మార్కెట్ లోన్లు తీసుకోడానికి వెసులుబాటు లభిస్తున్నదన్నారు. స్తోమతకు మించి అప్పులు తీసుకుంటున్నారనే అనుమానం అవసరం లేదన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి ఏదో ఒక రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సిందేనన్నారు.