- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడే రాష్ట్ర బడ్జెట్: అసెంబ్లీలో హరీశ్‌రావు.. కౌన్సిల్‌లో ప్రశాంత్‌రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న ఆర్థిక సంవత్సరానికి ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో సోమవారం ఉదయం పదిన్నర గంటలకు వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నరు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఆదివారం సమావేశమైన మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. మంత్రి హరీశ్‌రావు ఉదయం 8 గంటలకే హిమాయత్‌నగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గతేడాది బడ్జెట్ సైజు రూ. 2.56 లక్షల కోట్లుగా అంచనా వేసి జీఎస్‌డీపీని 13.04 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. ఈసారి కనీసంగా 15% మేర వృద్ధి ఉంటుందని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఓటర్లకు భారీ స్థాయిలోనే వరాలు, హామీలు కురిపించే అవకాశమున్నది. శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
రిజర్వు బ్యాంకు ద్వారా తీసుకునే అప్పులు కాకుండా రాష్ట్రం సుమారు రూ. 1.93 లక్షల కోట్ల మేర ఆదాయం ఆర్జిస్తుందని గతేడాది బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది దాదాపు 24% అధికం. అయితే తొమ్మిది నెలల వ్యవధిలో 56.8% (రూ. 1.09 లక్షల కోట్లు) మాత్రమే ఆర్జించింది. రాష్ట్ర ప్రభుత్వం 2021-22లో సైతం రూ. 1.76 లక్షల కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా 11% తగ్గి రూ. 1.56 లక్షల కోట్లు మాత్రమే సాధ్యమైంది. ఈసారి సవరించిన అంచనాలతో ఏ మేరకు తగ్గుతుందనేది కీలకంగా మారింది.